భారతదేశం, ఫిబ్రవరి 18 -- ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత పురాతన చరిత్ర ఉన్న దేవాలయాల్లో ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఒకటిగా ఉంది. కొల్లేరు సరస్సు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోటలోని పెద్దింట్లమ్మ ఆలయంలో వార్షిక అమ్మవారి జాతర(తీర్థం) ఫిబ్రవరి 18న ప్రారంభమైంది. మార్చి 3 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు జాతర జరుగుతుంది. కొల్లేరు ప్రాంతమే కాకుండా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.

ఈ ఆలయం రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైనది. పెద్దింట్లమ్మ దేవత పూజలు వేంగి తూర్పు చాళుక్య రాజవంశం కాలం నాటి నుంచి జరుగుతున్నాయని నమ్ముతారు. ఈ పండుగలో అతి ముఖ్యమైన ఆచారం జలదుర్గ, గోకర్ణేశ్వరుల దివ్య వివాహం ఫిబ్రవరి 28 రాత్రి సాంప్రదాయ ఆచారాలతో నిర్వహిస్...