భారతదేశం, ఫిబ్రవరి 18 -- ఆంధ్రప్రదేశ్లో అత్యంత పురాతన చరిత్ర ఉన్న దేవాలయాల్లో ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఒకటిగా ఉంది. కొల్లేరు సరస్సు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోటలోని పెద్దింట్లమ్మ ఆలయంలో వార్షిక అమ్మవారి జాతర(తీర్థం) ఫిబ్రవరి 18న ప్రారంభమైంది. మార్చి 3 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు జాతర జరుగుతుంది. కొల్లేరు ప్రాంతమే కాకుండా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.
ఈ ఆలయం రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైనది. పెద్దింట్లమ్మ దేవత పూజలు వేంగి తూర్పు చాళుక్య రాజవంశం కాలం నాటి నుంచి జరుగుతున్నాయని నమ్ముతారు. ఈ పండుగలో అతి ముఖ్యమైన ఆచారం జలదుర్గ, గోకర్ణేశ్వరుల దివ్య వివాహం ఫిబ్రవరి 28 రాత్రి సాంప్రదాయ ఆచారాలతో నిర్వహిస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.