భారతదేశం, ఫిబ్రవరి 23 -- రాష్ట్ర రైతులను ఎర్రబంగారం ఏడిపిస్తోందని.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి పంట నష్టాల ఘాటుకు రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని వ్యాఖ్యానించారు. పెట్టుబడి కూడా రాక అడ్డికి పావుషేరు కింద అమ్ముకుంటూ.. రైతు కన్నీళ్లు పెడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. క్వింటాకు రూ. 15 వేల నష్టంతో అమ్ముకుంటుంటే.. అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం.. మిర్చి రైతుల కళ్లల్లో కారం కొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి ఉద్దరించినట్లు కూటమి ప్రభుత్వం గప్పాలు కొడుతుంది. ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెడితే.. వచ్చే ఆదాయం లక్షన్నర లేదని రైతులు కంటతడి పెడుతున్నారు. కౌలు రైతుకు అదనంగా రూ.50 వేలకు నష్టమే అంటూ అల్లాడుతున్నారు. నిజంగా రాష్ట్ర రైతులపై కేంద్రానికి ప్రేమనే ఉంటే.. వెంటనే మ...