ఆంధ్రప్రదేశ్,గుంటూరు జిల్లా, ఫిబ్రవరి 12 -- వైసీపీ అధినేత జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ 2.0 పాలనే అని ఉద్ఘాటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన జగన్. చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అమలు చేస్తానన్న పథకాలన్నీ అబద్ధం, మోసమని విమర్శించారు. జగన్ అబద్దాలు చెప్పలేడు కాబట్టే 2024లో వైసీపీ ఓడిపోయిందన్నారు.

ఇప్పటికే ప్రజలు హామీలు గురించి ప్రశ్నిస్తున్నారని జగన్ గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలోని నేతలను కాలర్ కూడా పట్టుకుని ప్రశ్నిస్తారని చెప్పుకొచ్చారు.

"రాష్ట్రంలో స్కామ్‌లు తప్ప ఏమీ జరగడం లేదు. ప్రజలు కాలర్‌ పట్టుకునే పరిస్థితి వచ్చింది. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం తప్ప ఏమీ జరగడంలేదు. ఇసుక, లిక్కర్‌ స్కామ్‌లు చేస్తున్నారు. విచ్చలవిడిగా పేకాట...