Hyderabad, మార్చి 5 -- మహిళలు నిత్యం ఇంటి పనుల్లోనే గడుపుతారు. వారు ఉద్యోగాలు చేస్తున్నా, చేయకపోయినా కూడా ఇంటి పనుల్లో గంటలు గంటలు కష్టపడాల్సిందే. ఇంటిల్లిపాదికి ఆ ఇంటి ఇల్లాలి కష్టాన్ని గుర్తించలేరు. ఒక తాజా అధ్యయనం ప్రకారం ఒక ఇల్లాలు ప్రతిరోజూ ఏడు గంటల పాటూ ఇంటి పనులు చేస్తుందని తెలిసింది.

మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వారు 'టైమ్ యూజ్ సర్వే'ను విడుదల చేసింది. ఇది జనవరి 2024 నుండి డిసెంబర్ 2024 వరకు భారతీయులు ఎలాంటి కార్యక్రమాలలో తమ సమయాన్ని గడుపుతున్నారో తెలుసుకునే ప్రయత్నం. ఈ సర్వేలో నిద్ర, భోజనం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి స్వీయ సంరక్షణ కార్యక్రమాల నుండి వినోదం, సామాజిక కార్యక్రమాలు, ఇంటి పనుల వరకు వివిధ కార్యకలాపాలను పరిశీలించింది.

ఈ సర్వే ప్రకారం భారతీయులు తమ ఎక్కువ సమయాన్ని స్వీయ సంరక్షణలో గడుపుతున్నట్టు తేలింది. పురుషులు తమ సమయంలో...