భారతదేశం, మార్చి 17 -- Wife and Husband: మద్యం మత్తులో భార్యాభర్తలు ఒకరిపై దాడి చేసుకోవడంతో భార్య ప్రాణాలు కోల్పోయిన ఘటన మహబూబాబాద్‌లో జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్త ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం హున్యా తండాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.

మహబూబాబాద్‌లో జరిగిన ఘటనపై స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హున్యా తండాకు చెందిన భూక్య బుజ్జీ (44), భూక్య రాము (48) భార్యాభర్తలు. స్థానికంగా వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఒక కొడుకు, కూతురు ఉండగా.. కుమారుడైన అశోక్ హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు సంస్థలో కార్మికుడిగా పని చేస్తుండగా.. కూతురు సౌందర్యను మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపురం శివారులో ఉన్న పులిగడ్డ తండాకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేస...