తెలంగాణ,వరంగల్, మార్చి 9 -- గత నాలుగు రోజులుగా ఓరుగల్లులో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. తెల్లవారుజామునే మంచు దుప్పటి కప్పేస్తుండగా.. ఆ తరువాత సాయంత్రం వరకు మండే ఎండతో టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. ఇక రాత్రి అయ్యిందంటే చాలు ఉష్ణోగ్రతలు పడిపోతూ చలి కాలాన్ని తలపిస్తోంది. ఇలా ఒక రోజులోనే భిన్నమైన వాతావరణం కంగారు పుట్టిస్తుండగా.. ఓరుగల్లు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాగా వాతావరణ సమతుల్యత సమస్యల వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచి కొట్టడం మొదలు పెట్టాయి. ఇక మార్చి నుంచి అవి కాస్త ఎక్కువయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి ఎండ వేడి ఎక్కువవుతుండగా.. సాయంత్రం వరకు టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డే సమయంలో కొద్ది...