తెలంగాణ,వరంగల్, మార్చి 21 -- వేసవి వచ్చేసింది.! దీంతో తెలుగు రాష్ట్రాల్లో మామిడపండ్ల సీజన్ మొదలైపోయింది. ఇప్పటికే కోతకు వచ్చిన పంటను. మార్కెట్లకు తరలిస్తున్నారు. పలుచోట్ల విక్రయాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇందులో బంగినపల్లి మామిడికి మంచి పేరు ఉంటుంది. మామిడిలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ. బంగినపల్లికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే.

స్థానికం నుంచి ప్రపంచం వరకు బంగినపల్లి మామిడిపండ్లు ఎగుమతి చేస్తుంటారు. అయితే గురువారం వరంగల్ లోని ఎనుమాముల ముసలమ్మకుంటలో నూతన మామిడి మార్కెట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగినపల్లి మామిడి రికార్డ్ ధర పలికింది.

జిల్లా కలెక్టర్‌ తో పాటు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా మార్కెట్ లో నిర్వహించిన వేలంలో వ్యాపారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఇందులో బంగినపల్లి మామిడికి టన్ను రూ.1.22 లక్షల వరకు పలిక...