తెలంగాణ,వరంగల్, మార్చి 30 -- కాకతీయ విశ్వవిద్యాలయం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.428.82 కోట్లతో అంచనా బడ్జెట్ ను ప్రతిపాదించింది. యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన 40 వ అకడమిక్ సెనెట్ సమావేశంలో అర్థశాస్త్ర విభాగం ప్రొఫెసర్, ఎస్డీఎల్సీఈ డైరెక్టర్ ప్రొ.సురేశ్ లాల్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. దీంతో అకడమిక్ సెనెట్ సభ్యులు, కేయూ ఈసీ మెంబర్స్ బడ్జెట్ కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

మొత్తంగా రూ.428.82 కోట్లతో అంచనా బడ్జెట్ ప్రవేశ పెట్టగా, అందులో రూ.211.41 కోట్లు అంటే దాదాపు సగం నిధులు జీతాలు, పింఛన్లకే కేటాయించారు. ఈ మేరకు జీతాలు, పింఛన్లతో పాటు ఉద్యోగ విరమణ భత్యాలు, నిర్వహణ ఖర్చులు, పరీక్షలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రూ.369.21 కోట్లు అవుతుందని అంచనా వేశారు. మొత్తం బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వ నుం...