భారతదేశం, మార్చి 17 -- Warangal Crime: వరంగల్‌ జిల్లా పాకాల అటవీ ప్రాంతంఅలో వన్యప్రాణుల వేట వెలుగు చూసింది. వేటాడిని జంతువుల్ని తరలిస్తుండాగా ప్రమాదం జరగడంతో ఈ ఘటన వెలుగు చూసింది. పాకాల అభయారణ్యంలో వన్య ప్రాణులు వేటాడి, ఆటోలో తరలిస్తుండగా.. వారు వెళ్తున్న ఆటో కాస్త ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఓ వన్య ప్రాణి, మరో జంతు మాంసం బయటపడటంతో సదరు దుండగులు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని చిలుకమ్మనగర్ శివారు పాకాల సరస్సు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.

వరంగల్‌ ఫారెస్ట్ అధికారులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా అశోక్ నగర్ కు చెందిన ఇమ్మడి ఏకాంబ్రం, చిలుకమ్మ నగర్ కు చెందిన ఇస్లావత్ సుధీర్, బంగారి సుమన్, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మొండ్రాయిగూడెంకు చెందిన లవన్ కుమార్ స్నేహితు...