భారతదేశం, జనవరి 29 -- Vizag Suicides: విశాఖలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ జంట విడివిడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. యువ‌కుడు, వివాహిత మ‌హిళ ఒకే రోజు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది.

విశాఖ‌ప‌ట్నం జిల్లా ప‌ద్మానాభం మండ‌లం కృష్ణాపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, సానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కృష్ణాపురం గ్రామంలో క‌న‌క‌ల శంక‌ర్‌, ల‌క్ష్మి (31) దంప‌తులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. ఒక‌రు తేజేష్ (4వ త‌ర‌గ‌తి), ధ‌ను (2వ త‌ర‌గ‌తి) చ‌దువుతున్నారు. శంక‌ర్ ఇటుక బ‌ట్టీలో వ్యాన్ డ్రైవ‌ర్‌గా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదే గ్రామానికి మొక‌ర ర‌వి, జానకి దంప‌తుల‌కు ఒక్క‌గానిఒక్క కొడుకు ఆదిత్య‌ (21) ఉన్నారు. ఆదిత్య వైజాగ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

క‌న‌క‌ల ల‌క్ష్మి (31), మొక‌ర ఆదిత్య (21) మ‌ధ్య ...