భారతదేశం, ఫిబ్రవరి 1 -- భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్​లోకి వీవో తన సరికొత్త ప్రీమియం మోడల్ 'వీవో ఎక్స్200టీ'ని ఇటీవలే విడుదల చేసింది. దీనిని 'ఫ్లాగ్‌షిప్ కిల్లర్'గా కంపెనీ ప్రమోట్ చేస్తోంది. అంటే.. అత్యున్నత స్థాయి ఫీచర్లను, కాస్త అందుబాటు ధరలోనే అందించడం అన్నమాట. అయితే, కేవలం రెండు వారాల ముందే వీవో తన అసలైన ఫ్లాగ్‌షిప్ మోడల్ 'వీవో ఎక్స్300'ను కూడా లాంచ్ చేసింది. దీనితో ఇప్పుడు వినియోగదారుల్లో ఒకటే సందిగ్ధత.. తక్కువ ధరలో వచ్చే ఎక్స్200టీ కొనాలా? లేక అల్టిమేట్ కెమెరా, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఎక్స్300 తీసుకోవాలా? ఈ నేపథ్యంలో ఈ రెండింటి మధ్య ఉన్న కీలక వ్యత్యాసాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము.

బ్యాటరీ విషయానికి వస్తే, వివో ఎక్స్200టీలో 6,200ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ ఉంది. ఎక్స్300లో 6,040ఎంఏహెచ్​ బ్యాటరీ ఇచ్చారు. రెండింటిలోనూ 90డబ్ల్యూ ...