భారతదేశం, ఫిబ్రవరి 26 -- Vemulawada Rajanna: దక్షిణ కాశిగా పేరొందిన వేములవాడలో మహాశివరాత్రి జాతర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులు భారీగా తరలి వస్తున్నారు.‌

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరపున రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టిటిడి డిప్యూటీ ఈవో లోకనాథం, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించారు.

రాత్రి నుంచే భక్తుల రద్దీ వేములవాడలో కొనసాగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మిరమిట్లు గోలిపే విద్యుత్ దీపాలతో వేములవాడ ఆలయం సర్వాంగ సుందరంగా భక్తులను

త...