Hyderabad, ఫిబ్రవరి 28 -- మా పిల్లాడు ఫోన్ చూపిస్తే కానీ అన్నం తినడు, మా పాప టీవీ పెడితే కానీ నిద్రపోదు. ఏం చేయాలో ఈ అలవాటును ఎలా మాన్పించాలో అర్థం కావడం లేదని చాలా మంది తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తుంటారు. ఇలా రోజులో చాలా గంటలు ఫోన్ లేదా టీవీ చూడటం వల్ల పిల్లల కళ్లు ఎక్కడ పాడైపోతాయో అని బాధ పడేవారు కూడా ఎక్కువ మందే. అవును ఇలా పిల్లలు ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వల్ల కేవలం కళ్లు మాత్రమే కాదు పూర్తి ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు. కనుక ఎట్టిపరిస్థితుల్లోనూ మీ పిల్లల ఫోన్ లేదా టీవీ చూసే అలవాటు తగ్గించండి. అందుకోసం మీకు సహాయపడే చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

మీ పిల్లల చేత ఫోన్ లేదా టీవీ చూడటం మాన్పించాలంటే ముందు మీరు వాటికి దూరంగా ఉండాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే మిమ్మల్ని చూసే వారు నేర్చుకుంటారు. మీరు ఫోన్, టీవీ చూడటం మానకుండా వారిని...