తెలంగాణ,హైదరాబాద్, జనవరి 30 -- ఫిబ్రవరి 10 వ తేదీలోగా అత్యుత్తమ పర్యాటక విధానం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశ, విదేశాల్లోని అత్యుత్తమ పాలసీని అధ్యయనం చేసి తెలంగాణ పర్యాటక పాలసీని రూపొందించాలని చెప్పారు.

బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూరిజం పాలసీపై సమీక్షించారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా పాలసీ ఉండాలన్నారు. ప్రధానంగా టెంపుల్, ఎకో టూరిజంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) కు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బుధవారం సమగ్ర కుల గణనపై సమీక్షించిన ఆయన పలు కీలక అంశాలను పేర్కొన్నారు.

కుల ...