తెలంగాణ,హైదరాబాద్, జనవరి 17 -- తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తైపోయింది. ఓవైపు సంక్షేమ పథకాలను పట్టాలెక్కించే పనిలో ఉంటూనే.. మరోవైపు రాజకీయంగానూ బలపడే అవకాశాలపై ఫోకస్ పెడుతూ వస్తోంది. బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలను కూడా చేర్చుకుంది. కట్ చేస్తే.. త్వరలోనే స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పాగా వేసి. గ్రౌండ్ లో మరింత బలపడాలని భావిస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పట్నుంచి. పార్టీలోని చాలా మంది నేతలు పదవులపై ఆశలు పెంచుకున్నారు. రేపు మాపు అంటూ భర్తీ ప్రకటనలు వస్తున్నప్పటికీ. ముహుర్తం మాత్రం ఖరారు కావటం లేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. కొన్ని పదవులను భర్తీ చేశారు. అయితే ఇంకా చాలా కార్పొరేషన్లతో పాటు జిల్లా, నియోజకవర్గస్థాయిలో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. అయితే పార్టీ కోసం పని చేసిన నేతలను గు...