భారతదేశం, ఫిబ్రవరి 10 -- TG Localbody Elections: స్థానిక సమరంలో ముందుగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలపై దృష్టి సారించారు.

ఇప్పటికే గ్రామపంచాయతీల వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యే నాటికి వచ్చిన అదనపు ఓటర్లను కూడా చేర్చి జాబితాలు రూపొందించారు. నేడు ఎంపీటీసీల వారీగా ఆయా గ్రామాలలో మండల, జిల్లా పరిషత్ లో ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తున్నారు. ఈ జాబితాను బరిలోకి దిగే అభ్యర్థులు పరిశీలించుకునే వీలుంటుంది.

ఈనెల 11న పోలింగ్ కేంద్రాలను వెల్లడిస్తారు. 12, 13న పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన అభ్యంతరాలు స్వీకరించి అవసరమైన చేర్పులు, మార్పులు చేపడుతారు.‌ 13న పరిషత్ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్న...