భారతదేశం, ఫిబ్రవరి 23 -- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 60 సంవత్సరాలలోపు ఉద్యోగి చనిపోతే రెగ్యులర్ బెనిఫిట్స్‌తోపాటుగా అదనంగా రూ.10లక్షలు వచ్చేలా చర్యలు చేపట్టినట్టుగా తెలిపింది.

ఉద్యోగుల ఆరోగ్య భద్రత, ప్రమాదల విషయంపై కేబినెట్ చర్చించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, పింఛనర్లకు భారం కాకుండా.. చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణలోని 7.56 లక్షల మంది ఉద్యోగులు, పింఛనర్లు ఉన్నారని, ఉద్యోగి చనిపోతే రెగ్యులర్ బెనిఫిట్స్‌తోపాటుగా అదనంగా రూ.10లక్షలు వచ్చేలా పథకం తీసుకొస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. 17.7లక్షల మంది ఉద్యోగులు, పింఛనర్లక...