తెలంగాణ,హైదరాబాద్, డిసెంబర్ 27 -- ధరణి స్థానంలో 'తెలంగాణ భూ భారతి - 2024 చట్టం అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే ఈ బిల్లుకు తెలంగాణ శాసనభ ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకువచ్చే దిశగా సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే గెజిట్ విడుదలయ్యే అవకాశం ఉంది.

భూభారతి పూర్తిగా అమలు లోకి రావడానికి ఇంకా రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. ఇదే విషయంపై తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ. భూ భారతి పూర్తిస్థాయిలో అమల్లోకి రావటానికి రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. భూ భారతితో ప్రతి రైతుకు భరోసా దక్కబోతుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త చట్టంలో కీలక అంశాలు ఉన్నాయి. గతంలో ఉన్న ధరణి స్థానంలో భూ భారతి అమల్లోకి వస్తే. అనేక మార్పులు చోటు చేసుకోకున్నాయి. అయితే భూ భారతిలో ఎల...