భారతదేశం, ఫిబ్రవరి 3 -- భారతీయ మార్కెట్​పై పట్టు సాధించేందుకు.. ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగని 'మోడల్ వై' ఎలక్ట్రిక్ ఎస్​యూవీ కోసం కంపెనీ సరికొత్త "ఈవీ స్విచ్ అండ్​ సేవ్ ప్రోగ్రామ్"ను ప్రకటించింది. పాత పెట్రోల్ లేదా డీజిల్ కార్లను వదిలి ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలనుకునే వారిని ఆకర్షించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్​ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ కొత్త స్కీమ్ కింద, వినియోగదారులు తమ వద్ద ఉన్న ఏదైనా పెట్రోల్ లేదా డీజిల్ వాహనాన్ని ఎక్స్​ఛేంజ్ చేసి, టెస్లా మోడల్ వై 'రియర్ వీల్ డ్రైవ్' (ఆర్​డబ్ల్యూడీ) వేరియంట్‌ను కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 3,00,000 వరకు ఎక్స్​ఛేంజ్​ బోనస్ పొందవచ్చు!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేసేందుకు, వాహన ధరను సామాన్యులకు అం...