భారతదేశం, ఫిబ్రవరి 23 -- ఓ వైపు ఎండలు మెుదలవుతున్నాయనుకుంటుంటే.. మరోవైపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వరుణుడు పలకరించాడు. రాష్ట్రంలో మరికొన్ని గంటలు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్, మేడ్చల్‌లో వర్షం పడింది.
మరికొన్ని గంటలు హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, కాచిగూడతోపాటుగా కొన్ని ప్రదేశాల్లో వర్షం పడింది. ఇక మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.