తెలంగాణ,హైదరాబాద్, మార్చి 19 -- అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్‌) పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. 2020లోనే ఈ స్కీమ్ ను తీసుకువచ్చినప్పటికీ. ఆ తర్వాత ముందడుగు పడలేదు.అయితే ఈ స్కీమ్ కోసం రూ. 1000 రుసుంతో దరఖాస్తులను స్వీకరించగా. లక్షల సంఖ్యలో వచ్చాయి. ఆ దరఖాస్తులన్నీ పెండింగ్ లోనే ఉండిపోయిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక ఆఫర్ ను కూడా ప్రకటించింది. దీంతో చాలా మంది రెగ్యులరైజేషన్ కోసం ఆసక్తి చూపుతున్నారు.

స్కీమ్ అమలులో వేగం పెంచేందుకు 25 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అప్లికేషన్ చేసుకున్న చాలా మంది క్రమబద్ధీకరణ ఫీజులను చెల్లించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఆన్ లైన...