తెలంగాణ,హైదరాబాద్, మార్చి 12 -- ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. మొత్తం ఐదు స్థానాలు ఖాళీ కాగా. ఇందులో మూడు స్థానాలు కూడా హస్తం పార్టీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. మరో సీటు సీపీఐ, ఇంకో సీటు బీఆర్ఎస్ ఖాతాలో పడనుంది. ఇప్పటికే అభ్యర్థులు ఖరారు కాగా. నామినేషన్లు కూడా దాఖలు చేశారు. అయితే ఇందులో ఒకరిగా విజయశాంతి కూడా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేశారు. దీంతో ఆమె పేరు చుట్టూ విస్తృతంగా చర్చ జరుగుతోంది..! చివరల్లో సీటు విషయంలో ఆమెకు ఎలా లైన్ క్లియర్ అయింది..? ఈ విషయంలో ఎవరి సిఫార్సులు పని చేశాయన్న చర్చ జోరుగా జరుగుతోంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నాటి నుంచి చాలా మంది నేతలు అవకాశం కోసం ప్రయత్నాలు చేశారు. ఇందులో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యం...