భారతదేశం, ఫిబ్రవరి 5 -- Tata Punch on road price in Hyderabad : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీగా ఉన్న టాటా పంచ్​ ధరను పెంచింది టాటా మోటార్స్​. వేరియంట్ల బట్టి.. టాటా పంచ్​పై గరిష్ఠంగా రూ. 17వేల వరకు హైక్​ తీసుకుంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

టాటా పంచ్​లో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. అవి.. ప్యూర్​, అడ్వెంచర్​, అకంప్లీష్​డ్​, క్రియేటివ్​. ఎంట్రీ లేవల్​ టాటా పంచ్​ ప్యూర్​ వేరియంట్​ ధర రూ. 13వేలు పెరిగింది. ఫలితంగా.. టాటా మోటార్స్​కి చెందిన టాటా పంచ్​ ఎస్​యూవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 6.13లక్షలకు చేరింది. ఇతర వేరియంట్ల ధరలు గరిష్ఠంగా రూ. 10వేల వరకు పెరిగాయి.

Tata Punch price hike details : టాటా పంచ్​లో సీఎన్​జీ మోడల్​ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా.. దాని ధర కూడా పెరిగింది. సీఎన్​జీ మో...