భారతదేశం, ఫిబ్రవరి 15 -- భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్, తన సరికొత్త 'పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్' విడుదలకు సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 20న మార్కెట్​లోకి రానున్న ఈ మోడల్, ఇప్పటికే రహదారులపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. అయితే తాజాగా టాటా తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు ఆటోమొబైల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ రేంజ్​కి సంబంధించినది.

టాటా విడుదల చేసిన వీడియోలో ఒక ఆటోమొబైల్ జర్నలిస్ట్ ఈ ఎలక్ట్రిక్​ కారును జైపూర్ నుంచి ఉదయపూర్ వరకు డ్రైవ్ చేశారు.

ప్రయాణం: జైపూర్‌లో 100% ఛార్జింగ్‌తో మొదలైన ప్రయాణం 200 కిలోమీటర్లు సాగిన తర్వాత (బిజైన్‌నగర్ వద్ద), కారులో ఇంకా 67% బ్యాటరీ మిగిలి ఉంది.

మైలురాయి: 400 కిలోమీటర్లు ప్రయాణించి ఉదయపూర్ చేరుకున్నాక కూడా బ్యాటరీ 34% ఉం...