భారతదేశం, ఫిబ్రవరి 23 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 317 పాయింట్లు పెరిగి 82,815 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 117 పాయింట్లు వృద్ధిచెంది 25,571 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 432 పాయింట్లు పెరిగి 61,172 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 947.57 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,479.99 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ ఫిబ్రవరి​​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 2,479.99 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 13,954.02 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించాయి. ఉదయం 9 గంటల 25 నిమి...