భారతదేశం, ఫిబ్రవరి 2 -- బడ్జెట్​ 2026 సందర్భంగా ఆదివారం నిర్వహించిన ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీగా నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1547 పాయింట్లు పడి 80,723 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 495 పాయింట్లు పతనమై 24,825 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1193 పాయింట్లు పడి 58,417 వద్దకు చేరింది.

ఆదివారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 611.69 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 853.33 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.

జనవరి నెలలో ఎఫ్​ఐఐలు మొత్తం మీద రూ. 41,435.22 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 69,220.74 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ ...