భారతదేశం, ఏప్రిల్ 6 -- హార్వర్డ్ విశ్వవిద్యాలయ న్యాయ ప్రొఫెసర్, ది స్ట్రీట్ వ్యవస్థాపకుడు జిమ్ క్రామెర్ ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 1987 తర్వాత మొత్తం స్టాక్ మార్కెట్ అత్యంత దారుణమైన పతనాన్ని చవిచూస్తుందని, అన్ని స్టాక్‌లు నష్టపోతాయని అన్నారు. ఇది పెట్టుబడిదారులకు చాలా నష్టాలను తీసుకొస్తుందని అన్నారు. దీనికి ప్రధాన కారణం ట్రంప్ వాణిజ్య సుంకాలేనని చాలా మంది ప్రముఖ మార్కెట్ నిపుణులు అన్నారు.

యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ కారణంగా గతవారం అమెరికా స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాచ్ సంభవించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు సోమవారం రోజు ఎలా ఉంటుందోనని చూస్తున్నారు. ఎస్‌అండ్‌పీ 500 శుక్రవారం 6 శాతం పడిపోయింది. అదే సమయంలో డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 2,231 పాయింట్లు క్షీణించింది. ఇక నాస్‌డాక్ విషయానికి వస్తే 948...