భారతదేశం, ఫిబ్రవరి 3 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లో పండుగ వాతావరణం నెలకొంది! ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్​- అమెరికా వాణిజ్య ఒప్పందం కుదరడంతో దేశీయ సూచీలు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అతి భారీ లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 2648 పాయింట్లు వృద్ధి చెంది 85,314 వద్ద ఓపెన్​ అయ్యింది. నిఫ్టీ50 1,220 పాయింట్లు పెరిగి 26,308 వద్ద సెషన్​ని మొదలుపెట్టింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ ఏకంగా 2,792 పాయింట్లు పెరిగి 61,411 వద్ద ఓపెన్​ అయ్యింది.

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ మొదటి 15 నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 13లక్షల కోట్లు పెరిగింది! బీఎస్​ఈ మార్కెట్​ క్యాపిటల్​ రూ. 468.32 లక్షల కోట్లకు చేరింది. ఇండియా- యూఎస్​ ట్రేడ్​ డీల్​ కోసం స్టాక్​ మార్కెట్​ ఎంత ఎదురుచూసిందో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విధించ...