భారతదేశం, ఫిబ్రవరి 3 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లో పండుగ వాతావరణం నెలకొంది! ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్​- అమెరికా వాణిజ్య ఒప్పందం కుదరడంతో దేశీయ సూచీలు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అతి భారీ లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 2648 పాయింట్లు వృద్ధి చెంది 85,314 వద్ద ఓపెన్​ అయ్యింది. నిఫ్టీ50 1,220 పాయింట్లు పెరిగి 26,308 వద్ద సెషన్​ని మొదలుపెట్టింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ ఏకంగా 2,792 పాయింట్లు పెరిగి 61,411 వద్ద ఓపెన్​ అయ్యింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విధించిన సుంకాలు భారత ఎగుమతులను ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్​ టారిఫ్​లు అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. తొలుత 25శాతం సుంకాలు విధించిన ట్రంప్​, రష్యా చమురు అంశంలో భారత్​పై మరో 25శాతం సుంకాలు విధించారు. ఫలితంగా చాలా నెలల పాటు భారత్​ 50శాతం సుంకాలను ఎదుర...