భారతదేశం, ఫిబ్రవరి 17 -- దక్షిమ మధ్య రైల్వే పరిధిలో ముఖ్యమైన రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వరంగల్- విజయవాడ, కాజీపేట- బల్లార్ష మార్గాల్లో పలు రైళ్లు నిత్యం ఆలస్యంగా నడుస్తున్నాయి. బల్లార్ష నుంచి రామగుండం, మంచిర్యాల, ఉప్పల్‌ రైల్వే స్టేషన్ల నుంచి కాజీపేటకు వచ్చే భాగ్యనగర్, ఇంటర్‌సిటీ, కాగజ్‌నగర్‌ రైళ్లు రోజూ సగటున గంట నుంచి 2 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.

కాజీపేట- బల్లార్ష మార్గంలో.. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, కొలనూరు, ఓదెల రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో వరంగల్‌కు వస్తుంటారు. రోడ్డు ద్వారా వస్తే సమయం ఎక్కువ పడుతుంది. దూరం కూడా ఎక్కువ. దీంతో ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించడానికి మొగ్గుచూపుతారు. కానీ.. రైళ్లు ఆలస్యంగా నడ...