భారతదేశం, మార్చి 18 -- Siricilla Street Dogs: సిరిసిల్ల మండలం చిన్నబోనాల గురుకుల పాఠశాలలో కుక్కల దాడిలో ఐదో తరగతి విద్యార్థిని సువర్ణ తీవ్రంగా గాయపడ్డారు. కాలును కుక్క కొరికేయడంతో తీవ్ర గాయం కాగా డాక్టర్ లు 8 కుట్లు వేశారు. హాస్టల్ లో ఉండే విద్యార్థిపై కుక్కలు దాడి చేయడంతో విద్యార్థులతోపాటు పేరెంట్స్ భయాందోళన చెందుతున్నారు.

సిరిసిల్ల గురుకుల హాస్టల్‌కు సరైన రక్షణ లేకపోవడంతోనే కుక్కలు పాఠశాల ఆవరణలోకి చొరబడి విద్యార్థిని గాయపర్చాయని విద్యార్థులు పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్ వద్ద పిల్లలు పడేసే ఆహారానికి అలవాటు పడ్డ కుక్కలు, పిల్లలపై దాడి చేసినట్లు భావిస్తున్నారు.

సిరిసిల్లలో కుక్కల దాడిలో గాయపడ్డ విద్యార్థినికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన విద్యార్థిని గురుకుల పా...