భారతదేశం, ఏప్రిల్ 3 -- Siricilla Collector: కోర్టు ధిక్కరణ కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ సందీప్ కుమార్ ఝా హైకోర్టు విచారణకు హాజరయ్యారు. కలెక్టర్ క్షమాపణలు చెప్పడంతో చర్యలకు సిద్దంగా ఉండాలని సూచించి న్యాయమూర్తి కేసు విచారణను గురువారంకు వాయిదా వేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారులకు ప్రధానప్రతిపక్షం బిఆర్ఎస్ కు మద్య అంతర్యుద్దం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా అధికారులకు బిఆర్ఎస్ నాయకుల మద్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయం నడుస్తుంది. అందులో బాగంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరుపై బిఆర్ఎస్ నాయకులు, స్థానికులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు న్యాయమూర్తి కలెక్టర్ తీరుపై సీరియస్ అయ్యారు. కలెక్టర్ జరిగిన తప్పిదానికి క్షమాపణ చెప్పారు. అయినా చర్యలకు సిద్దంగా ఉండాలని హైకోర్టు నాయ్యమూర్తి కలెక్టర్ కు సూచించారు అప...