భారతదేశం, నవంబర్ 29 -- Centre rejects 10 names recommended by SC Collegium : 10మందిని వివిధ హైకోర్టుల జడ్జీలుగా నియమించేందుకు.. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును కేంద్రం తిరస్కరించింది. ఈ మేరకు సంబంధిత ఫైళ్లను ఈ నెల 25నే వెనక్కి పంపించేసింది. జడ్జీలను నియమించడంలో కేంద్రం ఆలస్యం చేస్తుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ఆసంతృప్తి వ్యక్తి చేసిన రోజే.. ఈ వార్త బయటకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

తిరస్కరణకు గురైన వారిలో పలువురు సీనియర్​ అడ్వకేట్లు సైతం ఉన్నారు. మాజీ సీజేఐ బీఎన్​ కిర్పాల్​ తనయుడు, సీనియర్​ అడ్వకేట్​ సౌరభ్​ కిర్పాల్​ పేరు కూడా ఈ జాబితాలో ఉంది.

"నేను ఒక గే. ఈ విషయం అందరికి తెలుసు. ఓ గేని ధర్మాసనంలో కూర్చోబెట్టే ఉద్దేశం కేంద్రానికి లేదు. అందుకే నాకు ఇంతకాలం పదోన్నతి లభించలేదు," అని జాతీయ మీడియాకు ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూల...