భారతదేశం, నవంబర్ 5 -- క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2025ను విడుదల చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ). అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లో చూసుకోవచ్చు.

జూనియర్ అసోసియేట్ పోస్టుల కోసం నిర్వహించిన ఈ ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష 2025కు సెప్టెంబర్ 20, 21, 27 తేదీల్లో హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకునే అవకాశం ఉంది.

అభ్యర్థులు sbi.co.in కి వెళ్లి, తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా ఫలితాన్ని యాక్సెస్ చేయవచ్చు.

లక్షలాది మంది అభ్యర్థులు ఈ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. కేవలం కొన్ని వేల మంది మాత్రమే ఇందులో అర్హత సాధించారు. వీరందరూ నెక్ట్స్​ జరిగే ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ పరీక్ష 2025కు హాజరు కావాల్సి ఉంటుంది.

ఈ ఎస్బీఐ క్లర్క్ 2025 పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 6,5...