భారతదేశం, ఏప్రిల్ 19 -- Samsung Galaxy F15 launch: శాంసంగ్ తన గెలాక్సీ ఎఫ్ 15 స్మార్ట్ ఫోన్ లైనప్ ను భారతదేశంలో మరింత విస్తరించింది. లేటెస్ట్ గా 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో కొత్త వేరియంట్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న గెలాక్సీ ఎఫ్ 15 (Samsung Galaxy F15) 4 జీబీ, 6 జీబీ ర్యామ్ వెర్షన్లకు ఇది జత కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15, ఎఫ్ హెచ్ డీ + డిస్ ప్లే తో. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ సెట్ ను అమర్చారు. అలాగే, ఇందులో 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 (Samsung Galaxy F15)లో కొత్తగా లాంచ్ అయిన 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు. యూజర్లు యాష్ బ్లాక్, గ్రూవీ వయొలెట్, జాజీ గ్ర...