భారతదేశం, మార్చి 21 -- RationCards EKYC: రేషన్‌ కార్డుదారులంతా ఈనెలాఖ‌రు లోగా ఈకేవైసీ చేయించుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం సూచించింది. ఈకేవైసీ పూర్తి చేయాల‌ని మార్గ‌ ద‌ర్శకాలు విడుద‌ల చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర ఆహార‌, పౌర స‌ర‌ఫ‌రాల మంత్రిత్వ శాఖ క‌మిష‌న‌ర్ సౌరభ్ గౌర్ మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేశారు. ఈ నెలాఖ‌రు లోగా ఈకేవైసీని పూర్తి చేయాల‌ని అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, అన్ని జిల్లా పౌర సరఫరాల అధికారులు (డీసీఎస్‌వో)ల‌కు ఆదేశించారు.

ఈ-పోస్ పరికరాలు, గ్రామ స‌చివాల‌య‌, వార్డు స‌చివాల‌య‌ మొబైల్ యాప్ ద్వారా రేష‌న్ లబ్ధిదారుల ఈకేవైసీని మార్చి 31 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. ఇప్ప‌టికే ఈకేవైసీ చేసుకున్న‌వారికి అవస‌రం లేదు. ఇంకా ఈకేవైసీ చేసుకోలేని వారికి చేయాల్సి ఉంది.

కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం, వ‌ల‌స కార్మికుల స‌మ‌స్య‌లు, క‌ష్టాలకు సంబంధించ...