భారతదేశం, మార్చి 10 -- తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్యకేసులో.. నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2 సుభాష్‌ శర్మకు మరణశిక్ష విధిస్తూ.. నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పునిచ్చింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్య జరిగింది.

302 రెడ్‌ విత్ 34 ప్రకారం.. ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. ఏ2కు సుభాష్‌ శర్మకు మాత్రం మరణశిక్ష విధించింది. 2020 మార్చిలో మొదటి ముద్దాయి మారుతీ రావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు 6 సంవత్సరాల ఐదు నెలల పాటు విచారణ జరిగింది. జీవిత ఖైదు పడిన వారిలో ఏ3 మహ్మద్ ఆష్ఘర్ అలీ, ఏ 4 మహ్మద్ అబ్దుల్ బారీ, ఏ 5 మహ్మద్ అబ్దుల్ కీరం, ఏ6 శ్రావణ్ (మారుతీ రావు తమ్ముడు), ఏ7 సముద్రాల శివ (మారుతీ రావు డ...