భారతదేశం, ఫిబ్రవరి 12 -- Ponnam Prabhakar: కుల గణన సర్వేలో పాల్గొనని వారికి కుల గణన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం దేశంలోనే మార్గదర్శకంగా కులగణనను చేపట్టిందని తెలిపారు.

పారదర్శకంగా కులాల సంఖ్యను తేల్చి బీసీలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు రాంగ్ డైరెక్షన్ లో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీల నేతలకు కుల గణనఫై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం సమగ్ర సర్వేతో అన్ని కులాల సంఖ్య తేలిందని చెబుతున్న బిఆర్ఎస్ నేతలు ఎందుకు ఆ లెక్కలను బహిర్గతం చేయకుండా దాచి పెట్టారని ప్రశ్నించారు. బిజేపి కులగణనను వ్యతిరేకిస్తు అపిడపిట్ ధాఖలు చేసిందని విమర్శించారు. బ...