Hyderabad, మార్చి 30 -- దానిమ్మ పండు రసాన్ని రోజూ తాగడం వల్ల శరీరానికి బోలెడు ప్రయోజనాలు అందుతాయట. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు గుండె ఆరోగ్యం వరకు ఎన్నో రకాలుగా మంచి కలుగజేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శరీరంలో పాడైన కణాలను వృద్ధి చేయడానికి, మిగిలిన భాగాలను రిపేర్ చేయడానికి అవసరమైనన్ని పోషకాలు దానిమ్మలో ఉన్నాయి. దానిమ్మ రోజూ తినడం వల్ల, జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియకు తోడ్పడుతుంది, చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా వీటిల్లో ఉండే గుణాలు ఎలా ఉన్నాయంటే..

దానిమ్మ జ్యూస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందజేస్తుంది. అంటు వ్యాధులు సోకకుండా నివారించి, ఆరోగ్యాన్ని ప...