భారతదేశం, ఫిబ్రవరి 13 -- కేరళలో పురాతనమైన తిరువల్లం శ్రీపరశురాముడి ఆలయాన్ని.. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దర్శించుకున్నారు. ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధికారులు, ప్రధాన అర్చకులు మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఆరో అవతారమైన శ్రీపరశురాముడికి పవన్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించి వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు. పవన్‌ కల్యాణ్‌ వెంట ఆయన కుమారుడు కూడా వెళ్లారు.

దక్షిణ భారతంలోని ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్‌ కల్యాణ్‌.. కీలక వ్యాఖ్యలు చేశారు. 'దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన పూర్తిగా నా వ్యక్తిగతం. రాజకీయాలకు సంబంధం లేదు. నాలుగున్నరేళ్ల కిందట చెల్లించుకోవాల్సిన మొక్కుల నిమిత్తం యాత్రకు వచ్చా. ఆరోగ్యం సహకరించకున్నా ఆలయాలకు వెళ్తున్నా. కేరళ, తమిళనాడులో ఉన్న ఆలయాలను దర...