భారతదేశం, ఫిబ్రవరి 4 -- తూర్పు కనుమల్లో ఉండే గోదావరి నదిలో పాపికొండల అందాలు ఎంతో అద్భుతం. రెండు కొండల మధ్య, దట్టమైన అడవుల్లో అలలపై విహరిస్తూ పచ్చని అందాలు చూడటం జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఊహించుకుంటూనే ఎంతో అద్భుతంగా ఉండే ఈ జర్నీ.. చేయడానికి పర్యాటకులు ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. అయితే మీరు కూడా పాపికొండలు చూడాలనుకుంటే ఎలా వెళ్లాలో ఇక్కడ తెలుసుకోండి...

హైదరాబాద్ నుంచి వెళ్లేవారు పాపికొండలు ట్రిప్ ప్లాన్ చేస్తే మధ్య భద్రాచలం ఆలయాన్ని దర్శించుకోవచ్చు. 2 రోజుల్లోనే ట్రిప్ పూర్తి చేసుకోవచ్చు. ముందుగా హైదరాబాద్ నుంచి బయల్దేరి. భద్రాచలం చేరుకోవాలి. ఇక్కడ రాములోరి ఆలయాన్ని దర్శించుకోవాలి. రాత్రి భద్రాచలంలోనే బస చేసేలా ప్లాన్ చేసుకోవాలి. అయితే పాపికొండలు టూర్ టికెట్లు ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. ఏపీ టూరిజం, తెలంగాణ టూరిజం వెబ్ సైట్లలోనే ...