భారతదేశం, ఫిబ్రవరి 2 -- టెక్ ప్రపంచంలో ఏఐ రేసు ఊపందుకుంటున్న వేళ, ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఏఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 30,000 మంది ఉద్యోగులపై వేటు వేయాలని కంపెనీ భావిస్తోంది. తద్వారా నిధులను ఆదా చేసి, డేటా సెంటర్ల నిర్మాణానికి మళ్లించాలని యోచిస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ 'టీడీ కోవెన్​' పరిశోధనా నివేదికను ఉటంకిస్తూ 'సీఐఓ' అనే సంస్థ ఈ సంచలన విషయాలను బయటపెట్టింది.

ఒరాకిల్​కి తన ఏఐ డేటా సెంటర్ల విస్తరణ కోసం సుమారు 156 బిలియన్ డాలర్ల మూలధన వ్యయం అవసరమని టీడీ కోవెన్​ అంచనా వేసింది. అయితే, ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు, బ్యాంకులు సందేహిస్తున్నాయని తెలుస్తోంది.

గత కొన్ని వారాలుగా పలు అమెరికా బ్యాంకులు ఒరాకిల్‌కు రుణాలు ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గాయని సమాచారం.

సామ్...