భారతదేశం, ఫిబ్రవరి 4 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ సిరీస్ 'ఫైండ్​ ఎక్స్​10' కోసం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఫైండ్​ ఎక్స్9 మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నప్పటికీ, అప్పుడే తర్వాతి జనరేషన్ ఫైండ్​ ఎక్స్10 సిరీస్‌కు సంబంధించిన కీలక ఫీచర్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కెమెరా హార్డ్‌వేర్ విషయంలో ఒప్పో మునుపెన్నడూ లేని విధంగా పెను మార్పులు చేయబోతోంది.

ప్రముఖ టిప్‌స్టర్ 'డిజిటల్ చాట్ స్టేషన్' వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒప్పో తన ఫైండ్​ ఎక్స్10 స్మార్ట్​ఫోన్​ సిరీస్ కోసం డ్యూయల్ 200ఎంపీ కెమెరా సెటప్​ని పరీక్షిస్తోంది. ఈ సెటప్‌లో 200ఎంపీ మెయిన్ కెమెరా, 200ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండనున్నాయి. ఈ రెండు కెమెరాల్లోనూ 1/1.3-ఇంచ్​ భారీ సెన్సార్లను వాడుతున్నట్లు సమాచార...