భారతదేశం, ఫిబ్రవరి 19 -- జపనీస్ ఆటో దిగ్గజం నిసాన్ భారత మార్కెట్​లో తన పట్టును పెంచుకునేందుకు సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. బడ్జెట్ ధరలో, మధ్యతరగతి కుటుంబాలకు సరిపోయేలా 'గ్రావైట్​' పేరుతో బీ-సెగ్మెంట్, త్రీ-రో, 7-సీటర్ ఎంపీవీని ఇటీవలే లాంచ్ చేసింది. మాగ్నైట్ విజయం తర్వాత నిసాన్ నుంచి వస్తున్న అత్యంత సరసమైన కారు ఇదే కావడం విశేషం. ప్రస్తుతం నిసాన్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో మాగ్నైట్, ఎక్స్-ట్రైల్ తర్వాత ఈ గ్రావైట్​ మూడొవ కారుగా చేరింది. అయితే నిసాన్-రెనాల్ట్ భాగస్వామ్యం కారణంగా, ఈ గ్రావైట్​ మోడల్ తన ఫ్రెంచ్ ప్రత్యర్థి అయిన 'రెనాల్ట్ ట్రైబర్' బాడీ డిజైన్‌ను పోలి ఉంటుంది.

మరి ఈ రెండింటిలో ఏది మెరుగైనదో ఇప్పుడు వివరంగా చూద్దాము..

నిసాన్ గ్రావైట్​ ఎంపీవీలో 1.0 లీటర్, త్రీ-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 72 హెచ్​పీ పవర...