భారతదేశం, ఏప్రిల్ 20 -- ఏ ఆదాయ పన్ను విధానాన్ని (పాత లేదా కొత్త) ఎంచుకోవాలనే విషయంలో చాలా మంది నిర్ణయం తీసుకోలేపోతున్నారు. ఆదాయ పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయ పన్ను విధానాన్ని తీసుకువచ్చింది. కొత్త ఆదాయ పన్ను విధానంలో ఐటీఆర్ ఫైలింగ్ ఈజీగా చేసేయొచ్చు. అలాగే, పాత ఆదాయ పన్ను విధానంలో పన్ను మినహాయింపులు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనే విషయంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ, పాత పన్ను విధానాన్ని (Old tax regime) కొనసాగిస్తామని ఆదాయ పన్ను శాఖకు స్పష్టంగా తెలియజేయనట్లైతే, బై డీ ఫాల్ట్ కొత్త ఆదాయ పన్ను విధానం (New tax regime) లోకి వెళ్తారు. అందువల్ల, మీరు మీ రిటర్న్ దాఖలు చేయడానికి గడువు తేదీకి ముందే ఏ విధానంలో ఉండాలనేది నిర్ణయించుకోవాలి.

పన్ను చెల్లింపుదారులు కొత్త ...