భారతదేశం, అక్టోబర్ 28 -- బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపానుగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. గత ఆరు గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలి తీవ్ర తుఫానుగా మారింది మొంథా. ఇది మచిలీపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 190 కి.మీ, కాకినాడకు దక్షిణ-ఆగ్నేయంగా 270 కి.మీ, విశాఖపట్నంకు దక్షిణ-నైరుతి దిశలో 340 కి.మీ, గోపాల్‌పూర్ (ఒడిశా)కి దక్షిణ-నైరుతి దిశలో 550 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాకినాడ సమీపంలోని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటనుంది. ఈ...