Hyderabad, మార్చి 18 -- చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతున్నారా? ముఖ్యమైన, గడిచిపోయిన విషయాలు ఎంత ప్రయత్నించినా గుర్తురావడం లేదా. అయితే మీరు వెంటనే జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మీ మెదడు ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేదంటే మీరు నెమ్మదిగా మతిమరుపుకు బానిస అయిపోతారు. అంత పని జరగకుండా ఉండాలంటే మెదడు ఆరోగ్యాన్ని పెంచే కొన్ని ఆహారాలను తినడం, వ్యాయామాలను చేయడం వంటివి అలవాటు చేసుకోండి.

నిజానికి శారీరక ఆరోగ్యం గురించి చాలామంది మాట్లాడుతారు కానీ మానసిక ఆరోగ్యం విషయానికి రాగానే నిర్లక్ష్యం చేస్తారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మానసిక ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం వల్ల శారీరక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. కనుక ఆహారాలు, వ్యాయామాలతో మీ మెదడును చురుగ్గా మార్చుకోండి. ఆహారాల సంగతి పక్కన పెడితే మెమొరీ పవర్ ను పెంచే మూడు రకాల వ్యాయా...