భారతదేశం, ఫిబ్రవరి 16 -- మార్కెట్‌లో కొత్త కొత్త ఎలక్ట్రిక్ కార్లు సందడి చేస్తున్నాయి. కస్టమర్లు కూడా ఆచితూచి కారు కొనుగోలు చేయాలి. పెట్టిన డబ్బుకు తగ్గట్టుగా ఫలితం ఉండాలి. ఇప్పటికే అనేక కార్లు ఉన్నాయి. అయితే ఈ విటారా కూడా మార్చిలో వచ్చేందుకు సిద్ధమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు టాటా కర్వ్ ఈవీ మార్కెట్‌లో ఉంది. ఈ రెండు కార్లలో ఏది బెస్ట్?

రాబోయే మారుతి ఈ విటారా రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. 49 kWh, 61 kWh. దీని 49 kWh బ్యాటరీ ప్యాక్ ఫ్రంట్-వీల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ (FWD)కి జతచేసి ఉంటుంది. ఇది 144 పీఎస్, 192.5 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని 61 kWh బ్యాటరీ ప్యాక్ FWDగా అందుబాటులో ఉన్నప్పటికీ, ఇది 174 పీఎస్, 192.5 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుకు జతచేసి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 500...