Hyderabad, ఫిబ్రవరి 5 -- నిమ్మ చెట్టును పెంచాలంటే ఇంటి వెనుక పెద్ద పెరడు ఉండాలని అనుకుంటున్నారా? అవసరం లేదు. బాల్కనీ ఉంటే చాలు. అందులోనే కుండీలో నిమ్మ చెట్టును పెంచేయచ్చు. సేంద్రీయ పద్దతిలోనే నిమ్మకాయలను పొందవచ్చు. నిమ్మ చెట్టును పెంచడానికి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే చాలు. సులువుగా అవి పెరిగేస్తాయి.

మీరు విత్తనాలను నాటాలనుకుంటున్నారా లేదా మొక్కను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అన్నది ముందుగా నిర్ణయించుకోండి. విత్తనాల నుండి పెంచినప్పుడు మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది. విత్తనం స్థాయి నుంచి అది ఎదగడాన్ని మీరు చూడవచ్చు. అయితే మొక్కను నాటడం వల్ల నిమ్మకాయలు త్వరగా, కచ్చితంగా కాసే అవకాశం ఉంది.

మీరు కుండలో మొక్కను పెంచుతున్నట్లయితే, అది పెద్ద కుండ అయి ఉండాలి. అప్పుడు మొక్క బాగా పెరుగుతుంది. కుండ లేదా సంచి 7 అంగుళాల లోతుతో విశాలంగా ఉండాలి.

నర్సరీల...